సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. కక్షిదారులు పలువురు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి గౌస్ పాషా మాట్లాడుతూ కక్షలు పెంచుకోకుండా రాజీ మార్గమే ఉత్తమమని, సామరస్యంగా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కోర్టు ఆవరణలో ప్రజలు, పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.