ఆదివారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, వాహనదారులకు, స్థానిక ప్రజలకు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించి, ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.