తుంగతుర్తి మండల కేంద్రంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. స్థానిక ఆరోగ్య కేంద్రం నుండి కోర్టు వరకు కాంట్రాక్టర్ రోడ్డును తవ్వి, కంకర పోసి వదిలేయడంతో భారీ వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి పేరుకుపోయి స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు వల్ల తమ రిక్షాలు పాడైపోయాయని స్థానిక రిక్షా కార్మికుడు తప్పెట్ల ఇస్తారి ఆవేదన వ్యక్తం చేశారు.