గాంధీభవన్‌లో స్వదేశీ మేళా

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో సుస్థిర విజ్ఞాన సదస్సు, స్వదేశీ మేళా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, కార్పొరేషన్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ ఆశయాలను స్మరించి ఆయన జీవితం అందించిన మార్గదర్శకాన్ని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్