హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్ నేపథ్యంలో.. క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు వేళలను పొడిగించారు. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు నడిచే మెట్రో సేవలు, మ్యాచ్ సందర్భంగా రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఉప్పల్, ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 12 గంటలకు చివరి రైళ్లు బయలుదేరుతాయి. ఈ అదనపు సేవలను అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని ఎల్అండ్టీ మెట్రో సూచించింది.