ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న టేక్ హోం శాలరీ

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు సంబంధించి జీతంలో కీలక మార్పులు రానున్నాయి. ప్లే స్లిప్, టేక్ హోం శాలరీ, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్‌లలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం.. ఉద్యోగుల జీతంలో బేసిక్ పే కనీసం 50 శాతం ఉండేలా మార్పులు చేస్తున్నారు. ఇదివరకు బేసిక్ పే సీటీసీలో 25-40 శాతం ఉండేది. ఇకపై అలవెన్సులు 50 శాతం దాటితే పీఎఫ్, గ్రాట్యుటీకి మళ్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్