TG: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరవ్యాప్తంగా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా.. 10 వేల సీసీ కెమెరాలతో పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర మార్గాల్లో 24 డ్రోన్లతో నిఘా కొనసాగుతుంది. విగ్రహాల లెక్కింపు కోసం 100 హైరైజ్ కెమెరాలను వినియోగించనున్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం 26 షీ-టీమ్స్‌ను మూడు షిఫ్టుల్లో మోహరించారు.