తెలంగాణ కేబినెట్ కాసేపట్లో భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయనున్నారు. భూమిలేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డులపై భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు.