తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులను ప్రోత్సహించేందుకు సేవ పతకాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎస్సై విఠల్, మెదక్ టౌన్ ఏఎస్ఐ రుక్సానా బేగం ఈ పతకాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అధికారులను ఎస్పీ అభినందించి, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.