TG: పురపాలక ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ ఓటరు జాబితా సవరణకు ప్రకటన జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. జనవరి 5న పురపాలక కమిషనర్ అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించనున్నారు.