ప్రత్యామ్నాయ పంటలు వేస్తే.. ఎకరానికి రూ.5 వేల ప్రోత్సాహకం!

TG: రాష్ట్రంలో వరి సాగు పెరుగుతూ, ఇతర పంటల సాగు తగ్గుతున్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. ప్రత్యామ్నాయ పంటలు(వరికి బదులుగా పెసలు, కందులు, జొన్నలు, నూనెగింజలు, కూరగాయలు)సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాగునీటి లభ్యత, ధాన్యం కొనుగోలు, బోనస్ వంటి కారణాలతో రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు.

సంబంధిత పోస్ట్