తెలంగాణలో BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు వంటి ప్రముఖులు ఉన్నారు. BRS పార్టీ ఈ ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. అసెంబ్లీ స్పీకర్ దీనిని పట్టించుకోలేదు. దీంతో BRS సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడు నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.