తెలంగాణ జైళ్లశాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు

తెలంగాణ జైళ్ల శాఖకు ప్రతిష్ఠాత్మక స్కోచ్‌–2026 అవార్డు లభించింది. ఖైదీలను మాదకద్రవ్యాల నుంచి దూరం చేసేందుకు రాష్ట్రంలోని జైళ్లలో నిర్వహిస్తున్న డీ-అడిక్షన్‌ సెంటర్లకు ఈ గుర్తింపు దక్కింది. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్‌ సెంటర్‌లో శనివారం జరిగిన 109వ స్కోచ్‌ సమ్మిట్‌–ఇండియా ఎకనామిక్‌ ఫోరంలో జైళ్లు, కరెక్షనల్‌ సర్వీసెస్‌ డీజీ డా. సౌమ్య మిశ్రా అవార్డును అందుకున్నారు. ఇప్పటివరకు 4,200 మంది ఖైదీలకు డ్రగ్‌ స్క్రీనింగ్‌ నిర్వహించగా.. 2,126 మందిని మాదకద్రవ్యాలకు బానిసలుగా గుర్తించి కౌన్సెలింగ్‌, చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕