పండుగ వేళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శుభవార్త అందించింది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, తిరిగి వచ్చే ప్రయాణానికి కూడా టికెట్ బుక్ చేసుకుంటే, టికెట్ ధరపై 10% రాయితీ లభించనుంది. ఈ ఆఫర్ ద్వారా ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ధరలను తగ్గించి, ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే TSRTC లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం ఉన్నప్పటికీ, పురుషులు మరియు ఇతర ప్రయాణికులను ఆకర్షించడానికి ఈ రాయితీని అందిస్తోంది.

సంబంధిత పోస్ట్