తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) షెడ్యూల్ విడుదలైంది. ఆన్‌లైన్ పరీక్షల వివరణాత్మక షెడ్యూల్‌ను ఎస్సీఈఆర్‌టీ (SCERT) డైరెక్టర్, టీజీటెట్ కన్వీనర్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో జరగనున్నాయి. ప్రతిరోజూ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. సెషన్-1 ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్