TG: ట్రాఫిక్, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేశారు. టీజీ టీఎంఏఆర్ఎస్ (TG TMARS) గా పిలువబడే ఈ ప్రత్యేక విభాగం, ADGP లేదా IG స్థాయి అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఇది ట్రాఫిక్ నిర్వహణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై పర్యవేక్షణ చేస్తుంది. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ORRపై పెట్రోలింగ్, రోడ్డు ప్రమాదాలపై శాస్త్రీయ దర్యాప్తు, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, ఓవర్‌స్పీడింగ్‌పై నిఘా వంటివి దీని విధులు. ప్రతి జిల్లాలో అదనపు SP స్థాయి ట్రాఫిక్ పోస్టులు, ట్రాఫిక్ సిబ్బందికి బాడీ వోర్న్ కెమెరాలు, రాష్ట్ర ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ట్రాఫిక్ విభాగంలోని 300 పోస్టులు ఈ బ్యూరోకు బదిలీ చేయబడ్డాయి.