అమెరికాలో తెలుగు అమ్మాయి అనన్య గోలి అరుదైన గౌరవం అందుకుని తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచింది. కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అందించే ప్రతిష్ఠాత్మక ‘మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్’ అవార్డుల్లో భాగంగా అనన్య ‘స్టేట్ హానరబుల్ మెన్షన్’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గోలి కృష్ణచైతన్య, సంపా సిన్హా దంపతుల కుమార్తె అయిన అనన్య ప్రస్తుతం అమెరికాలోని ఈడెన్ ప్రైరీ హైస్కూల్‌లో చదువుతోంది. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో విశేష ప్రతిభ, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి ఈ గౌరవాన్ని అందుకుంది.