తమిళనాడు సీఎస్‌గా తెలుగు ఐఏఎస్ అధికారి

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సాయికుమార్ నియామకం పరిపాలన, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేసిన సాయికుమార్, మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పొందారు. 1990లో తమిళనాడు కేడర్ ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టి, అసిస్టెంట్ కలెక్టర్ నుండి సీఎస్ స్థాయికి ఎదిగారు. ధర్మపురి కలెక్టర్, మదురై కార్పొరేషన్ కమిషనర్, విద్యుత్ మండలి ఛైర్మన్ వంటి పదవులు నిర్వహించారు. 2018లో ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా, అనంతరం రెవెన్యూ పరిపాలన కమిషనర్‌గా పనిచేశారు. 2022 నుండి తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్