తెలుగు ఐఏఎస్ అధికారికి రాజస్థాన్ సీఎస్ పదోన్నతి

తెలుగు ప్రాంతానికి చెందిన 1989 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు కేంద్రప్రభుత్వంలో పలు కీలక స్థానాల్లో పనిచేసిన ఆయనను, రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఢిల్లీ నుంచి సొంత రాష్ట్ర క్యాడర్‌కు పంపారు. నవంబరు 17న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీనివాస్ అరకులోయలో జన్మించి, కెమికల్ ఇంజినీరింగ్ లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి, సివిల్స్ లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్