తెలుగు యూట్యూబర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

బాలికపై లైంగిక దాడి కేసులో తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు ఏపీలోని విశాఖ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా భార్గవ్ 'ఫన్ బకెట్' పేరుతో వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తనతో నటించే ఓ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేయగా.. శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది.

సంబంధిత పోస్ట్