లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు: మంత్రి పొంగులేటి

TG: హైదరాబాద్‌ నగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్లకు అవసరమైన భూసేకరణ మరో 2-3 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. క్యూర్ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఒక్కో నియోజకవర్గంలో 500 నుంచి 1,000 ఇళ్ల నిర్మాణం ప్రారంభించి, అనంతరం రెండు, మూడో విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్