ఉద్రిక్త పరిస్థితులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితులపై  విదేశాంగ శాఖ, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు. 9871999044, 9958322143, 9910014749, 9643723157.

సంబంధిత పోస్ట్