ఎయిర్ ఇండియా నూతన సీఈవో, ఎండీగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ మాజీ చీఫ్ టెవోల్డే గెబ్రెమరియం నియమితులయ్యారు. బుధవారం ఎయిర్ ఇండియా ఈ ప్రకటన చేసింది. క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న గెబ్రెమరియం, సంస్థ ఆర్థిక నష్టాలను అధిగమించి, అంతర్జాతీయంగా విస్తరించి లాభాల బాట పట్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గెబ్రెమరియం గతంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌ను ఆఫ్రికాలోనే అతిపెద్ద, లాభదాయక సంస్థగా తీర్చిదిద్దిన సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు.