TG: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా కానుకగా రెండు కరువు భత్యాలు (డీఏ) ప్రకటించింది. 2024 నుంచి పెండింగ్లో ఉన్న రెండు డీఏలను విడుదల చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తారు. CM రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా భారం అయినప్పటికీ, ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం ఈ డీఏలను మంజూరు చేయడానికి అంగీకరించారని మంత్రులు తెలిపారు. దీ