TG: కలెక్టర్లకు ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించింది. బాలికల వసతి గృహాల్లో మహిళా IAS అధికారులు నిద్ర చేయాలని ఆదేశించింది. అలాగే వసతులపై నివేదిక ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో గదులు, మౌలిక వసతులు సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని సమయాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్