తెలంగాణలో రైతుల అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి. సన్నబియ్యం క్వింటాకు రూ.500 చొప్పున జమ చేస్తున్నారు. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ఒక రైతు ఖాతాలో క్వింటాకు రూ.500 చొప్పున రూ.30వేలు అకౌంట్ లో వేశారు. శనివారం రూ.కోటికిపైగా చెక్కులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జారీ చేయగా, 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.