తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో రైతు భరోసాపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంట పండిన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం పంపిణీ, రైతు భరోసా కింద ఒక్కో ఎకరానికి ఒక్కో సీజన్‌కు రూ.7,500 చొప్పున రూ.15 వేలు ఇవ్వబోతున్నారు.