తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత అధికారికంగా సోమవారం కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట(D) తిరుమలగిరి మండల కేంద్రంలో సోమవారం CM రేవంత్ చేతుల మీదుగా రేషన్‌కార్డులు జారీ చేయనున్నారు. ఈ జనవరి 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. ఇప్పటి వరకు కొత్తగా జారీ చేసిన, చేస్తున్న కార్డుల సంఖ్య 5,61,343. పాత కార్డుల్లోని డూప్లికేట్ పేర్లు తొలగించిన తర్వాత ప్రస్తుతం కార్డుల్లో సభ్యుల సంఖ్య 3,09,30,911గా తేల్చారు.