తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్టుల రూపంలో ఇచ్చేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. QR కోడ్‌తో కూడిన కార్డులకు సంబంధించి వివిధ రకాల డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి బిడ్‌లు దాఖలు చేసేందుకు మార్చి 25 వరకు గడువు ఇచ్చింది. కాగా కొత్త రేషన్ కార్డుల కోసం 18 లక్షల దరఖాస్తులు వచ్చాయి.