ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆగస్టు 2న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత కింద మొత్తం రూ.20,500 కోట్ల విలువైన నిధులను నేరుగా రైతుల అకౌంట్లలో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. రూ. 20,500 కోట్ల మొత్తాన్ని 9.7 కోట్ల మంది రైతులకు బదిలీ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కేంద్రం ఈ పథకాన్ని 2019లో ప్రవేశపెట్టబడింది. ఇప్పటివరకు 19 విడతల ద్వారా రూ.3.69 లక్షల కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేశారు.