TG: ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టీజీ రెరా రియల్ ఎస్టేట్ సంస్థ మంగళవారం రూ.38.63 లక్షల జరిమానా విధించింది. రెరాలో నమోదు చేయని ప్రాజెక్టులను ప్రకటనలు, ప్రచారం చేయడంతో పాటు, రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా నమోదు కాకుండానే ఒక ప్రాజెక్టు విక్రయాలను నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన రాము ఫిర్యాదు మేరకు టీజీ రెరా సుమోటో విచారణ ప్రారంభించింది.