తెలంగాణలో ఈ ఏడాది వసంత పంచమి ఫిబ్రవరి 3న రావడంతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకు సెలవు ఉండనుంది. హాలిడేపై మిగతా స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అటు ఏపీ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించలేదు. దీంతో ఆ రాష్ట్రంలో విద్యాసంస్థలు యథావిధిగా నడవనున్నాయి.