తెలంగాణలోని 14 గ్రామాల వివాదం 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ప్రారంభమైంది. అప్పట్లో ఈ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (ఇప్పుడు తెలంగాణ) కలిసినా.. మహారాష్ట్ర వీటిని తమ గ్రామాలుగా భావిస్తోంది. 1987లో వీటిని ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని మహారాష్ట్ర ఆరోపిస్తోంది. 1996లో ఆంధ్ర హైకోర్టు తెలంగాణకు చెందినవేనని తీర్పునిచ్చింది. కానీ మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.