ఆఫ్రికా గడ్డి మైదానాల్లో గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో పరిగెత్తే చీతాను సైతం బబూన్లు (కోతులు) భయపెడతాయి. చీతా సాధారణంగా చిన్న బబూన్‌ను లక్ష్యంగా చేసుకున్నా, గుంపుగా ఉన్న బబూన్లు తమ కోరపళ్లు, బలమైన చేతులు, గుంపుగా దాడి చేసే స్వభావంతో చీతాలను అప్రమత్తం చేస్తాయి. గాయపడటానికి భయపడే చీతా, అనవసర పోరాటాలను తప్పించుకుంటుంది. ఒంటరి బబూన్ అయితే చీతాకు దొరికే అవకాశం ఉన్నా, గుంపుగా ఉన్నప్పుడు బబూన్లు చీతాలను వెనక్కి తగ్గిస్తాయి. వేగం కంటే ఐక్యత, ధైర్యం, వ్యూహం ముఖ్యమని ఈ సంఘటనలు చెబుతున్నాయి.