భారత టీవీలో తొలి వాణిజ్య ప్రకటన.. గ్వాలియర్ ఫ్యాబ్రిక్స్

భారతీయ టెలివిజన్ చరిత్రలో జనవరి 1, 1976న తొలి వాణిజ్య ప్రకటన ప్రసారమైంది. అప్పటి ఏకైక ఛానెల్ దూరదర్శన్‌లో గ్వాలియర్ సూటింగ్ అండ్ ఫాబ్రిక్స్ కంపెనీకి చెందిన 60 సెకన్ల బ్లాక్ అండ్ వైట్ ప్రకటన ప్రసారమైంది. "దేఖ్నేమే భీ రిచ్ లుక్" అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ప్రకటన, మధ్యతరగతి ప్రజలలో బ్రాండెడ్ దుస్తులపై ఆసక్తిని పెంచింది. 1982లో కలర్ టీవీ రాకతో ప్రకటన రంగం మరింత అభివృద్ధి చెందింది. ఈ తొలి గ్వాలియర్ ప్రకటన భారతీయ టెలివిజన్ వాణిజ్య ప్రయాణానికి నాంది పలికింది.

సంబంధిత పోస్ట్