సుమారు 7వేల సంవత్సరాల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు కల్చర్ మొదలైంది. ఆరోజుల్లో మహిళలు బలవర్థకమైన ఆహారం కోసం అంబలి కాచుకునేవాళ్లు. అయితే కొందరు ఆడవాళ్లు మాత్రం ధాన్యాలకు మూలికలను జోడించి నీళ్లలో బాగా మరిగించి పానీయాలు తయారు చేసుకునేవాళ్లు. అలా చేసుకున్న పానియాలను నిల్వ బెట్టడం చేస్తుండేవారు. అవి పులిసిపోయి విచిత్రమైన వాసన, రుచికి మారేవి. అవి తాగితే మత్తుగా మధురంగా ఉండేది. అలా మొదలైంది ఈ మత్తుపానియాల వ్యవహారం.