ది ప్యారడైజ్‌: తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు అనుమతి

నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి మంజూరు చేసింది. సెప్టెంబర్ 23 సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి లభించగా, టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. చిత్ర నిర్మాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు రూ.1 కోటి విరాళం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్

✕
✕