తెలంగాణ మార్చ్‌కు నేటితో 14 ఏళ్లు పూర్తి

TG: స్వరాష్ట్ర ఆకాంక్షను చాటిచెబుతూ 2012 సెప్టెంబర్ 30న నిర్వహించిన చారిత్రక తెలంగాణ మార్చ్ (సాగరహారం) బుధవారం (సెప్టెంబర్ 30)తో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. 'ఇంటికో మనిషి.. చేతిలో జెండా.. చలో హైదరాబాద్' నినాదంతో వేలాది మంది ఉద్యమకారులు, తెలంగాణవాదులు ఆంక్షలు, నిర్బంధాలను ధిక్కరించి తరలివచ్చారు. నెక్లెస్ రోడ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఉద్రిక్త పరిస్థితుల్లో లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఈ ఆందోళన తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచింది.

సంబంధిత పోస్ట్

✕
✕