వారికి భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8th పే కమిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కమిషన్ అమల్లోకి వస్తే వారి జీతాలు, పెన్షన్లు 30-34% పెరుగుతాయని ప్రముఖ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ Ambit Capital తాజాగా అంచనా వేసింది. బేసిక్ పే, అలవెన్సులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు పెరగొచ్చని తెలిపింది. దీంతో 44లక్షల మంది ఉద్యోగులు, 68లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఈ కొత్త పే స్కేలు 2026 జనవరి నుంచి అమలులోకి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్