తెలంగాణ రాష్ట్రంలో 18 కార్పొరేషన్లకు చైర్మన్లను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. వీరిలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా బస్వరాజ్ శ్రీనివాస్, ఆర్మర్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా దాసరిరాజు అజయ్ కుమార్, గీతకార్మికుల కార్పొరేషన్ చైర్మన్‌గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా దొంగారి వెంకటేశ్వర్లు, మేర సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా సంగా వెంకటరాజం, వాల్మీకి బోయ సహకార సంస్థ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, మున్నూరుకాపు సహకార సంస్థ చైర్మన్‌గా బొమ్మ శ్రీరామ్, యాదవ సహకార సంస్థ చైర్మన్‌గా ఎం. రఘునాథ్ యాదవ్, వడ్డెర సహకార సంస్థ చైర్మన్‌గా గుంజా రేణుక నారాయణ, తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూడెం వెంకట్ రమణ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బండి రమేష్, పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా గూడురు శ్రీనివాస్, భట్టురాజ్ సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా సి.హెచ్. బాలరాజు, వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగ్ రావు, గొర్రెలు & మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా కొల్లె సరిత, పశుసంవర్ధక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా చరణ్ కౌశిక్ యాదవ్, తెలుగు అకాడమీ చైర్మన్‌గా ప్రొఫెసర్ వెంకట నారాయణ, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా సూదిని రామిరెడ్డి నియమితులయ్యారు.