ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఎయిర్‌పోర్టులలో సౌదీ అరేబియాలోని డమ్మంలో ఉన్న కింగ్ ఫాహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచింది. ఇది భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 137.8 చదరపు కిలోమీటర్లతో ఉత్తర అమెరికాలోనే అతిపెద్దది. మలేషియాలోని కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 100 చదరపు కిలోమీటర్లు, తుర్కియేలోని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు 76.5 చదరపు కిలోమీటర్లు, అమెరికాలోని డల్లాస్ (ఫోర్ట్ వర్త్) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 69.7 చదరపు కిలోమీటర్లు, వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 47.8 చదరపు కిలోమీటర్లు, బీజింగ్ డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 47 చదరపు కిలోమీటర్లు, ఓర్లాండో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 46.9 చదరపు కిలోమీటర్లు, జార్జ్‌ బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 44.5 చదరపు కిలోమీటర్లు, షాంఘై పుడోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ ఎయిర్‌పోర్టులు ఆయా దేశాల సంస్కృతి, నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి.

సంబంధిత పోస్ట్