ఎలుకలు కొరికితే లేదా వాటి మలం, మూత్రం ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్లు వ్యాపిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. వీటి కారణంగా ఇన్ఫెక్షన్ల భారీన పడుతామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ర్యాట్ బైట్ వైరస్, లెప్టోస్పిరోసిస్, హంటావైరస్, ధనుర్వాతం వంటివి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాగా TGలోని కాకతీయ వర్సిటీ హాస్టల్‌లో తమను తరచూ ఎలుకలు కరుస్తున్నాయని విద్యార్థినులు వాపోతున్నారు. స్టూడెంట్లు ఇన్ఫెక్షన్ల బారిన పడక ముందే వర్సిటీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.