ఆధార్‌ మొబైల్‌ యాప్‌లో ఈ సదుపాయం 6 నెలలు ఫ్రీ

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తన మొబైల్‌ యాప్‌లో ఈమెయిల్‌ అప్‌డేషన్‌పై రుసుములను తొలగించింది. ప్రస్తుతం రూ.75 వసూలు చేస్తుండగా, జులై 1 నుంచి ఆరు నెలల పాటు, అంటే 2026 డిసెంబర్‌ 31 వరకు ఉచితంగా ఈ సేవను అందిస్తోంది. ఎక్కువ మంది ఈమెయిల్‌ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసుకునేలా ప్రోత్సహించడమే ఈ ఉచిత సదుపాయం ముఖ్య ఉద్దేశ్యం. ఆ తర్వాత రుసుముల గురించి సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్