‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్’.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డుగా దీనికి పేరు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ జారీ చేసే ఈ కార్డును అమెక్స్ బ్లాక్ కార్డ్ అని కూడా అంటారు. వార్షిక ఆదాయం 1మిలియన్ డాలర్లు(రూ.8,58,25,000) కంటే ఎక్కువ ఉన్నవారే ఈ కార్డుకు అర్హులు. ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది, మన దేశంలో 200 మంది వద్ద ఈ కార్డు ఉంది. దీనితో ఎయిర్ పోర్టులు, ఫైవ్ స్టార్ హోటళ్లలో లగ్జరీ సదుపాయాలు లభిస్తాయి.