దేశంలో రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా శరావతి బ్రిడ్జి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. కర్ణాటక శివమొగ్గ జిల్లా సిగందూర్ సమీపంలోని శరావతి బ్యాక్ వాటర్‌పై రూ.473 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇది 2.14 కిలోమీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో ఉంది. 740 మీటర్ల కేబుల్ ఆధారంగా నిలుస్తుంది. దేశంలో అతిపొడవైన కేబుల్ బ్రిడ్జి గుజరాత్‌లోని సుదర్శన్ సేతు.