ఆ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి: ఆర్టీసీ కార్మిక సంఘాలు

దేశవ్యాప్తంగా 30 కోట్ల కార్మికులను కట్టుబానిసల్లా మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మారుస్తూ అన్యాయానికి పాల్పడుతోందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదరు వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం హక్కును రద్దు చేయడం అన్యాయమన్నారు.

సంబంధిత పోస్ట్