సబ్బుకు వేల ఏళ్ల చరిత్ర.. తొలి వాడకం, తయారీ విధానం ఇవే!

మనుషులు వేల సంవత్సరాలుగా సబ్బును ఉపయోగిస్తున్నారని చరిత్రకారులు చెప్తున్నారు. సుమేరియన్, బాబిలోనియన్, ఈజిప్షియన్‌ గ్రంథాలలో సబ్బుల గురించి తొలిసారి ప్రస్తావించారు. క్రీ.పూ 2800 ప్రాంతంలో బాబిలోన్‌లో నూనె, చెక్క బూడిద మిశ్రమంతో సబ్బు లాంటి పదార్థాలను తయారు చేసేవారు. ఈజిప్షియన్లు సబ్బును ఔషధంగానూ వాడేవారు. 17వ శతాబ్దం నుంచి యూరప్‌లో కూరగాయల నూనెలతో సబ్బులు తయారవుతున్నాయి. 1800 నుంచి సబ్బు ధనవంతులకు తప్పనిసరి వస్తువుగా మారింది. 1853లో సబ్బుల వ్యాపారం ఊపందుకుని, బార్‌ సబ్బులు అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్