రాష్ట్రంలో కొత్తగా మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే?

TG: రాష్ట్రంలో వరంగల్‌లో కాకుండా మరో రెండు ఎయిర్‌పోర్టులను నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే వరంగల్ వద్ద మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ఆమోదం లభించగా వచ్చే నెలలో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనికి అనుమతి రావాల్సి ఉంది. ఇందుకోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే అనుమతులు లభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు ఎయిర్ పోర్టులు అందుబాటులోకి వస్తే ప్రజలకు విమాన ప్రయాణం మరింత సులభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్