ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి బుధవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు 4 కిలోమీటర్ల రోడ్‌షో నిర్వహించి, భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా, రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి ముందే ప్రకటించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కరీంనగర్, సిరిసిల్లలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.