ఆధార్‌ కేంద్రాలు నిర్వహించాలంటే పరీక్ష రాయాల్సిందే

TG: ఆధార్‌ శాశ్వత కేంద్రాలు నడపాలంటే UIDAI నిర్వహించే పరీక్షలో కనీసం 65% మార్కులు తప్పనిసరిగా సాధించాలి. ఇది పాత నిర్వాహకులకు కూడా వర్తిస్తుంది. అన్ని కేంద్రాలు ‘ఇన్‌-హౌస్‌ మోడల్‌’లోకి మారుతున్న నేపథ్యంలో ఈ షరతు విధించారు. కేంద్రాల నిర్వహణకు రూ.1.5 లక్షల విలువైన సామగ్రి డిపాజిట్‌తో అందించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,151 కేంద్రాల్లో 727 మాత్రమే పనిచేస్తుండగా, కొత్త విధానంతో మిగిలినవి కూడా ప్రారంభమవుతాయి.

సంబంధిత పోస్ట్